విరోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు :)
కోకిలమ్మ పాటలతో చిగురించే కొత్త ఆశల వసంతం...
ఆరు రుచులు పంచుకునే ఈ ఉగాది సర్వ శుభ ఉగాది కావాలని...
విరోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు :)
ఉగాదికి మీకోసం వేప పూత
చెట్టెక్కి కోసుకోండి బంగింపల్లి మామిడిపండు :)
కోకిలమ్మ పాటలతో చిగురించే కొత్త ఆశల వసంతం...
ఆరు రుచులు పంచుకునే ఈ ఉగాది సర్వ శుభ ఉగాది కావాలని...
విరోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు :)
ఉగాదికి మీకోసం వేప పూత
చెట్టెక్కి కోసుకోండి బంగింపల్లి మామిడిపండు :)
© Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008
Back to TOP
35 మీ ప్రతిస్పందన, సూచనలు:
మీకు, మీ కుటుంబానికి విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
కొంచం పూతా, కొన్ని కాయలూ పోస్టులో పంపరూ..?
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. కనీసం ఫోటోలలోనైన చూసే భాగ్యం కలిగించినందుకు నెనర్లు.
మీకందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు పరిమళం....
@A.Y. ఈ సారి ఉగాదికి speed postలో పంపిస్తను లెండి :)
ఉగాది శుభాకాంక్షలు వేణూ శ్రీకాంత్ గారు..ఫోటోలే ఎందుకు మీ స్వగ్రుహా లో అన్నీ వుంటాయష గా :)
మీకు కూడా విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
:)
మీకు మీ కుటుంబానికి శ్రీ విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వేణుగారు :)
e madya nenu blog chudatam ledu me Ralina rekulu, udagi wishes pic lu miss ayyanu :-(
అయ్యో రామ...! ఇందులో "miss" అయ్యేదేమీలేదు వాణిగారు ...మీకు కుదిరినప్పుడు..చూడాలనిపించినప్పుడల్లా చూడడానికి ఫోటోలు ఎప్పుడూ ఇక్కడే ఉంటాయ్ ఎక్కడికీ పోవు :)....
మీరు అందించిన అభిమాననికి ధన్యవాదాలు అన్న చిన్న మాట తప్ప ఏమి అనలేకున్నాను.
అత్యద్భుతమైన చిత్రాలు..!
మీ కెమెరా కొట్టేసే ప్లాన్ ఏదన్నా గీస్తే బావుంటుందనిపిస్తుంది ;)
ధన్యవాదాలు మధురవాణి గారు
మీ చేతిలోనే ఉంది కదండి కేక లాంటి కేమెరా ఒకటి
మీరు లలిత గారితో కలిసి sketch గీసేయండి హృతిక్ రోషన్ (Mr.A) సహాయం కావాలా ;)
ఆహా ఈ వేప పూతలను చూస్తుంటే నాకు షడ్రుచుల సమ్మేళనం ఆ ఉగాది పచ్చడి నోట్లో ఊరుతోంది. నేను గత రెండు సంవత్సరాలనుండి ఇంటికి దూరమయ్యా...ఇంటి దగ్గరున్నప్పుడు [కాకినాడ లో] మేమే కోసుకుని తెచ్చుకుని అమ్మకిచ్చేవాళ్ళం. ఆ రోజులు మరవలేనివి. మళ్ళీ నాకు ఆ రోజులు గుర్తుచేసి ఇంటికెల్లిపోవాలని అనిపించేలా చేసారు. మీ పాపం ఊరికే పోదు... :)
మీది కాకినాడే, మాది కాకినాడే ;)
అంటే అసలూరు కాదు కానీ చదువంతా అక్కడే, పూలలో చాలా వరకూ కాకినాడలోవే...పాపం ఎక్కడికీ పోలేదు, వచ్చి పడ్డానుగా మహా నగరంలో :)
ఓహ్!! మీరు కాకినాడలోనే చదువుకున్నారా? చూసారా అందుకే ఇంత అద్భుతమైన కళ ఎలా అబ్బిందా మీకు అని ఉబ్బితబ్బిబ్బౌతున్నా..[:D]అదన్న మాట సంగతి. నేను నా ఊరిని పేర్కొనడం మంచిదైంది...మీరు కూడా ఆ ఊర్లో చదువుకున్నారని తెలిసింది. ఇంతకీ కాకినాడ లో ఎక్కడుండేవారొ చెప్పండి...ఈ సారి ఎన్ని విషయాలు తెలుస్తాయొ ఎవరికి తెలుసు..[:)]
హిహిహి నేనుండేదీ కాకినాడే
:-))
బాబా గారు నిజంగానా...మీరు కూడా కాకినాడ లోనే ఉంటున్నారా...ఎక్కడ? మీరేం చెస్తుంటారు?
కాకినాడ గ్యాంగా? నేను కాకినాడ లొనె చదువుకున్నా.. విద్యుత్ నగర్ లొ వుండెవాడిని.
@లక్ష్మణ రావు గారు, మేము విద్యుత్ నగర్ లో ఉండేవాళ్ళమండి...మరి మీరో
@ బాబా గారు, మీ కళాశాలకు emcet పరీక్ష రాయడానికి వచ్చామండి ఆ వైశాల్యం చూసి కాస్త ఈర్ష్య కలిగింది ......
ఎవరక్కడ మా గల్లీలో "మంచు పల్లకి" మోసేస్తొంది ;) ఏ school మీరు బహుశా మనకి పరిచయం వుందేమో
స్కూల్ కాదు. ఇంజినీరింగ్ (జె న్ టి యు). విద్యుత్ నగర్ లొ రూం. "ఫూడ్ ..అన్ని మెస్ లు ట్రై చేసాం..." వీర్ కమల్ (వీర్ లేదు లెండి) లొ కి వచ్చిన అన్ని సినిమాలు చూసెవాళ్ళం.
మరీ వివరంగా అడిగేస్త్నాననుకోపోతే రమణగారని, JNTUలో profఉండేవారు, వళ్ళింటెదురుగుండా ఉండే వారా....
వీర్ కమల్ మధ్యలో మూసేసారు, బస్సువాడు అరవడానికే పనికొచ్చింది కొన్నాళ్ళు.... మల్లీ ఇంద్ర తో తిరిగి ప్రారంభించారు,hits & కాస్త averageగా ఆడినవన్ని తెచ్చేవాడు, కొన్ని గొప్ప సినెమాలు direct release చేసేసేవాడులే
ఐడల్ కాలెజి రొడ్ లొ ఒక చిన్న పార్క్ వుందేది. (అప్పట్లొ అది మూసెసి వుండెది). దానికి ఒప్పొసిట్ లొ వుండెవాళ్ళం. మేము వున్నప్పుడు వీర్ థియెటర్ క్లొజ్ కాని కమల్ థియెటర్ వుండెది. నాకు కమల్ థియెటర్ చాలా ఇస్టం. టికట్ తక్కువ. ఎప్పుడూ క్వాలిటి కంప్రమైజ్ అయ్యెవాడు కాదు. వాడు ఎ సి తొ వదిలె పెర్ఫుం (హాల్ ఫ్రెషనర్ ) నాకు బాగా నచ్చెది. జి.పి.టి దగ్గర వెంకటెశ్వర స్వామి గుడి, వీర్ కమల్ దగ్గర సాయిబాబా గుడి, వీర్ కమల్ కి కొద్ది ముందుకి వెలితె ఒక టిఫిన్ సెంటర్ వుండెది, దాంట్లొ టిఫిన్, అప్పుడప్పుడు సుబ్బయ్య హొటల్ భొజనం ఇవన్ని తీపిగుర్తులు. నాకు కాకినాడ నచ్చడానికి కారణం అక్కడ జనాలు. చాలా హెల్పింగ్ నెచర్ వుండెది. హా.. ఇల ఎంతయైనా రాయగలను. :-))
నేను హాస్చర్యపడిపోయి, లేచి, మీకు బదులిస్తున్నాను...మీరేమనుకోపోతే ఏ సంవత్సరమో చెప్పగలరా. మేము 95 నించి ఉన్నాము విషయం ఏమిటంటే పార్క్ ఎదురుగా ఇంట్లోనే. అంటే పార్కు కి రెండు వైపుల ఇళ్ళుండేవి, మీరేవైపు, ఇడేల్ కాలేజి ఉన్న వైపా లేక పక్కనే సందు తిరిగిన వైపా. పార్కులో బోల్డన్ని మామిడి చెట్లు, వాటికింద బెంచీలు, ఓ పెద్ద జీడిమామిడి చెట్టు ఉండేవి, వర్షం పడినప్పుడు, మెలికలు తిరిగినట్లున్న దారి నిండా నీరు నిండిపోయి, వంపులు తిరిగిన సెలయేరులా ఉండేది, తడవకండా అటునుంచి ఇటు దూకడం ఓ పేధ గొప్ప. మధ్యలో, అంటే ఓ పక్కకి, పెద్ద నుయ్య ఉండేది, వేసవిలో అందులో దూకి ఆడుకునే వాళ్ళం పిల్లకాయ్ లందరూ.....ఒక వైపు నిండా పూసిన కాయితం పూల చెట్లు ఉండేవి,...ఇంక వీర్ కమల్ గురించి చెప్పకర్లేదు, మేమొచ్చిన 3ఏళ్ళకనుకుంటా మూసేసారు,Jurassic park, rangeela etc.... అందులోనే చూశాము, ఇంక సుబ్బయ్యగారి భోజన హోటలు గురించి చెప్పేదేముంది, బాణి నిండా కూర, కూర ఏమిటో తెలియకుండా జీడిపప్పులతో ఉంటే అది కచ్చితంగా సుబ్బయ్య గారి హోటలే అని తెలిసిపోయేది :) అందులో పునుకుల కూర సూపరు.....ఇంక జనాల గురించి చెప్పేదేముందండి....చుట్టాలు బంధువులు ఎవ్వరూ అక్కడ లేకపోయినా, మీదేవూరు అని అడిగితే టక్కున కాకినాడ అని వచ్చేస్తుంది.....
BTW
మీ పిక్చర్స్ చాలా బాగున్నాయి. నేను ఇంతకు ముందు చూసాను కాని మీరు తీసెది అర్డినరి కెమెరా తొ అని నిన్నె చదివా.. ఈ విషయం చదివాకా మీలొ చాలా స్కిల్ మరియు చాలా చాలా ఓపిక వుందని అర్థం అయ్యింది.
అందుకే స్పేషల్ అబినందనలు . Good work.
కార్నర్ అంటే..., రెండు పోర్షన్ల ఇల్లా, ఇంటెదురుగా గుల్మోహోర్ చెట్లు ఉండేవి, ఇంకో కార్నర్ ఇంట్లోనా,.... అందులో ప్రత్యేకం ఏమిటంటే గోడ మధ్యలోంచి మామిడి చెట్టు బయటకు వచ్చేది.
తుఫాను వచ్చినప్పుడు నేను 4th క్లాస్ వారం సెలవని తప్ప ఇంకేం తెలీదు..
చెప్పడానికి మీకు ఒక నోరు వుంటే నాకు రెండు చెవులున్నాయ్ :)
ధన్యవాదాలండి :) ఓపిక కొంచం ఎక్కువే ఇంకేం లేదు, ఏదో దేవుడు గీసిన బొమ్మని, చిత్రంలో బందించేయాలని చిన్ని చిన్ని ప్రయత్నాలు అంతే
There you go. గోడ మద్యలొనుండి వచ్చె ఇంట్లొనె...
హే ఆ ఇంట్లోనా...మీరు అద్దెకుండేవారా, మేము తాతగారి మనవలేమో అనుకునేవాళ్ళం :)
మీరప్పుడప్పుడూ డాబా పైన పుస్తకం పట్టుకుని పచార్లు కొడుతూ ఉండేవారు కదా....
యా.. పాచార్లు తొ పాటు అప్ప్దప్పుడు చదవడం కూడా... మా ఫ్రెండ్స్ ఇంకా వుండెవారు. వాళ్ళు చదువుకోవడానికి డాబా మీదకి వచ్చెవారు. ఒకవెళె మీరు ఇప్పుడయిన అర్థరాత్రి 2 కి వీది గుమ్మం దగ్గర చదువుడం చుస్తె మాత్రం అది నేనే :-)
పదకొండు వరకు తిరిగి వచ్చి 12 కి మొదలు పెట్టెవాడిని. ఒక్కొసారి సెకండ్ షొ చూసాక మొదలుపెట్టెవాడిని. రూం లొ లైట్ మిగతావాళ్ళకి ఇబ్బంది అని బయట అరుగు మీద దుకాణం.
నాకు మీరు తప్పకుండా ధన్యవాదాలు తెలియజేయాల్సిందే :) నేనేదో ఊసుపోక సరదాగా కాకినాడని ప్రస్తావించా. అమ్మో ఇంతకి దారి తీస్తుందని ఊహించలేదు... చాలా ఆనందంగా ఉంది మీ చర్చ చదివాక. చాలా ఆశ్చర్యపోయా...నాకూ ఆ ప్రదేశాలు బాగా జ్ఞాపకం ఉన్నాయి. మా ఇల్లు అక్కడ కాకపొయినా నేను అటు వైపు వెల్తూ వస్తుంటా....మీరన్నట్టుగానే కమల్ వీర్ థియాటర్ మళ్ళీ కొత్తగా వీర్ కమల్ అని పెట్టి ఇంద్ర సినిమా తో మొదలెట్టాడు. సెకండ్ రిలీజ్ సినిమాలు వేస్తుండేవాడు. నేను పి. ఆర్ కలాశాలలో చదివా డిగ్రీ. నేను కాకినాడ లో గత ఇరవై ఏళ్ళుగా ఉన్నా...ఈ మూడు ఏళ్ళ నుంచి రాష్ట్రానికి దూరమయ్యా.....కాకినాడ ఆ పేరు వింటేనే ఎక్కడ లేని పులకింతా కలుగుతుంది....అదే పులకింత మళ్ళీ మీ దృశ్యకావ్యాలు చూస్తుంటే కలుగుతుంది.
ఓ పధో ముప్పైయ్యో సార్లు మీకు ధన్యవాదాలు లక్ష్మణరావుగారు :)
పల్లెటూరులో హాయి, సిటీ లోని సౌకర్యాలు, కలిపేస్తే కాకినాడండి
కాకినాడని రెండు ముక్కల్లో భళేగా చెప్పారు. మీరు చెప్పింది అక్షర సత్యం. ఇంతకీ మీరు ఇప్పుడు ఏం చెస్తున్నారు [వృత్తి పరంగా]??
:)
నేనింకా చదువుతున్నానండి M.A English
oh....M.A English chestunnaaraa....very good & All the best.
Thank you :)
vepa poota photo chala bavundi
Post a Comment