Monday, August 3, 2009

అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసం....

ఉపోద్ఘాతం:

అనగనగా ఒక రోజు సీతాకోకచిలుక అరచేత వాలింది...అనుకోకుండా ఒకరోజు అదే రంగులో ఉన్న గూడు కనిపించింది...బయటకు వచ్చిన వెంటనే సీతాకోక చిలుకలు రెక్కలు తడిగా ఉండడం వల్ల ఎగరలేవని, అప్పుడు సాలిపురుగులు వాటిని స్వాహా చేసేస్తాయనీ విన్నాను..దీనిని ఎలాగైనా కాపాడెయ్యాలని దట్టంగా ఆకులున్న పొదలాంటి మొక్కలో పెట్టా తీసుకెళ్ళి..ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని చూడడం....

ఆ రోజెందుకో త్వరగానే నిద్రలేచాను.....ఉదయం 6:30 అయ్యింది...అలవాటు ప్రకారం వచ్చి చూస్తే బయటకు రావడానికి అష్టకష్టాలూ పడుతున్న సీతా కోక చిలుక కనిపించింది..ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తి కెమేరా తెచ్చేశా..


గూడు రంగుకీ సీతాకోకచిలుక రెక్కల రంగుకీ అస్సలు సంబంధం లేకపోవటం ఆశ్చర్యం వేసింది...


మెల్లిగా ముడత పడిన రెక్కలు ఆరాయి


పూర్తిగా ఆరినట్టే అనిపించాయ్



గాలికి రెక్కలు రెపరెపలాడాయ్



కానీ ఎగిరే అంత బలంగా ఇంకా అవ్వలేదు...



చివరికి కాస్త నిలబడ్డాయ్


ఇలా గంట వుంది నే లోపలికెళ్లి బయటకు వచ్చేసరికీ ఎగిరిపోయింది...అది ఎగరడం నే చూడలా....



బయటకు వచ్చి వదిలేసిన గూడు




  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP