Monday 3 August 2009

అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసం....

ఉపోద్ఘాతం:

అనగనగా ఒక రోజు సీతాకోకచిలుక అరచేత వాలింది...అనుకోకుండా ఒకరోజు అదే రంగులో ఉన్న గూడు కనిపించింది...బయటకు వచ్చిన వెంటనే సీతాకోక చిలుకలు రెక్కలు తడిగా ఉండడం వల్ల ఎగరలేవని, అప్పుడు సాలిపురుగులు వాటిని స్వాహా చేసేస్తాయనీ విన్నాను..దీనిని ఎలాగైనా కాపాడెయ్యాలని దట్టంగా ఆకులున్న పొదలాంటి మొక్కలో పెట్టా తీసుకెళ్ళి..ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని చూడడం....

ఆ రోజెందుకో త్వరగానే నిద్రలేచాను.....ఉదయం 6:30 అయ్యింది...అలవాటు ప్రకారం వచ్చి చూస్తే బయటకు రావడానికి అష్టకష్టాలూ పడుతున్న సీతా కోక చిలుక కనిపించింది..ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తి కెమేరా తెచ్చేశా..


గూడు రంగుకీ సీతాకోకచిలుక రెక్కల రంగుకీ అస్సలు సంబంధం లేకపోవటం ఆశ్చర్యం వేసింది...


మెల్లిగా ముడత పడిన రెక్కలు ఆరాయి


పూర్తిగా ఆరినట్టే అనిపించాయ్



గాలికి రెక్కలు రెపరెపలాడాయ్



కానీ ఎగిరే అంత బలంగా ఇంకా అవ్వలేదు...



చివరికి కాస్త నిలబడ్డాయ్


ఇలా గంట వుంది నే లోపలికెళ్లి బయటకు వచ్చేసరికీ ఎగిరిపోయింది...అది ఎగరడం నే చూడలా....



బయటకు వచ్చి వదిలేసిన గూడు




30 మీ ప్రతిస్పందన, సూచనలు:

వేణూ శ్రీకాంత్ 4 August 2009 9:13 AM  

అద్భుతం నేస్తం. నువ్వు చూసి ఆనందించడం కాకుండా కెమేరా లో బందించి మాకు కూడా ఈ చిన్ని ఆనందాన్ని పంచినందుకు వేవేల ధన్యవాదాలు. చాలా బాగునాయి ఫోటోలు, నీ వ్యాఖ్యానం.

నేను 4 August 2009 6:44 PM  

:) ధన్యవాదాలు వేణుగారు, అది బయటకు రావడం చూస్తున్నప్పుడు సృష్టికర్త ఇంద్రజాలంలా అనిపించింది.

Rani 4 August 2009 7:15 PM  

opigga eduru choosinanduku phalitam dakkindi meeku. nice photos :)

మధురవాణి 4 August 2009 8:03 PM  

ఒక అద్భుత దృశ్యాన్ని, మాక్కూడా కళ్ళకి కట్టినట్టుగా చూపించారండీ.!
మీ ఓపికకి మెచ్చుకోకుండా ఉండలేం :) ధన్యవాదాలు.

Siri 4 August 2009 8:21 PM  

సరైన సమయంలో మీరు అక్కడ ఉండటం ఓపికగా తీసారు చాలా బాగుంది :)

నేను 4 August 2009 10:33 PM  

Rani, మధురవాణి, Siri ధన్యవాదాలు :)

@Rani,అవునండి నిజంగా శాస్త్రవేత్తకి కలిగినంత ఆనందం కలిగింది :)
@మధురవాణి, ఆ రెక్కలు మెల్లిగామడత విడినప్పుడు...చాలా చాలా wow అనిపించిందoడి...

@Siri,గూడు కనిపించినప్పటి నుండి ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని చూడడం దినచర్యలో భాగం ఐపోయిందండి, పైగా అప్పుడు సెలవలు కూడా, అందుకే చూడగలిగాను....

చిలమకూరు విజయమోహన్ 5 August 2009 5:52 AM  

ఓపికగా సృష్టివిలాసాన్ని మా కనుల ముందు ఆవిష్కరింపజేసారు.

జీడిపప్పు 5 August 2009 7:56 AM  

Wonderful!!!

నేను 5 August 2009 6:39 PM  

అంతా ఆ సృష్టికర్త దయ విజయమొహన్ గారు...

Thanks జీడిపప్పు :)

మెహెర్ 5 August 2009 6:41 PM  

Lovely images!

rani 6 August 2009 1:29 AM  

pichekinchave spandy.....naku butter fly ni chusi pichekkalede....ninnu chusi ekkindi....asalu a srustikartha indrajaalam emitante.....ne lanti athyantha opika kaligina ammai ni naku jaan jigiri ga marcheyadam.....asalu antha sepu kurchini snaps theesina ninnu talchukuni aashyaryapadi.....malla lechi....comment pedtunanu.....oosome snap....

నేను 6 August 2009 8:39 AM  

Thanks మెహర్ :)

Thanks dear "Su" నా పిచ్చిని భరించే ఓపిక నీకు ఉంది కబట్టే నువ్వు నా జిగినీ దోస్త్ ఇపోయావ్ :)...

yasaswini 6 August 2009 7:38 PM  

spandy it was amazing no words to express abt it. really hats off to you

నేను 6 August 2009 8:50 PM  

Thanks Yasaswini.
Amazing అనిపించింది కాబట్టే చిత్రం తీశాను, ఊ.... ;)
in between, నా పేరును ఖూనీ చెయ్యకు pleeeeez

Akash Яковский 10 August 2009 4:46 PM  

చాల బాగుందండీ మీ 'ప్రయోగం'... చక్కని పరిశీలనా శక్తి గలవారు...

lakshmana rao 10 August 2009 9:44 PM  

ఆ సీతాకోక చిలుక లోని సున్నితత్వాన్ని బాగా చిత్రీకరించారు...వ్యాఖ్యానించారు. సమయానికి మీరు బాగా స్పందించారు కాబట్టి మాకు ఒక మంచి అనుభవం ఎదురైంది. కోకిల అందాన్ని చూడాలంటే వసంతం కోసం ఎదురు చూడాలి. ఈ భ్రమర అందాల్ని చూడడానికి కాలాలు అవసరం లేదు కనులు ఉంటే చాలు.

నేను 11 August 2009 12:15 PM  

ధన్యవాదాలు ఆకాష్ గారు...

ధన్యవాదాలు లక్ష్మణ రావుగారు, చక్కగా చెప్పారు అవి కనిపించేది మీకు కనువిందు చేయడానికేగా :)

భావన 13 August 2009 8:19 AM  

స్పందన అధ్బుతం.. ఒక్క సారి మనసు మూగబోయినట్లయ్యింది ప్రకృతి ని సృష్టి ని అలా కళ్ళముందు నువ్వు చేసిన ఆవిష్కరణ చూసి... థేంక్ యూ చిన్న పదం కాని అంత కంటే పెద్ద పదాలు లేవు కదా మనసులోని సంతోషాన్ని కృతజ్ఞతను తెలపటానికి. చాలా బాగా తీసేవు స్పందనా..

నేస్తం 13 August 2009 2:48 PM  

అద్భుతం..చాలా బాగుంది

నేను 15 August 2009 9:35 AM  

ధన్యవాదాలు భావనా, అదలా బయటకు రావడం చూస్తూ ఉంటే, కొంచం చాలా హాశ్చర్యపడిపోయేశాను....

ధన్యవాదాలు నేస్తం

ఉష 15 August 2009 12:56 PM  

no words, 'manasu moogapOyimdi. chinnappuDu ilaagE guDDulOmchi pillalu raavaTam choosaamu, alaagE aavu dooDa puTTaTam. kaanii idi swECChaki pratiika. hRdayam mabbullO telinamta aanamdam.' You deserve more than just this wordof appreciation.

నేను 15 August 2009 11:06 PM  

ఆహా...!! నేనవేవీ చూడలేదండి..., ఒక్కసారి మేక పిల్ల పుట్టటం చూశానంతే, చినప్పుడెప్పుడో, ఇది నిజంగా wow అనిపించింది
ధన్యవాదాలు :)

మంచు పల్లకీ 29 September 2009 1:06 AM  

విజయదశమి శుభాకాంక్షలు

నేను 30 September 2009 2:11 PM  

మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలండి

tholiadugu 9 October 2009 10:38 PM  

ఎంటొ నేస్తం నిన్ను పొగద్టనికి మాటలు రావడం లేదు
వేవేల అందాలు ఒక్కసారిగా కన్నులముందు కదిలించావు

ఇంకొ మాట నేస్తం నేనెప్పుడైనా అడిగితే నీ సీతాకొకలను నాకు అప్పుగా ఇవ్వాలి మరి."ఊరికే అడిగాలెండి"
మాళ్ళా ఈ కొటి సీతాకోకల కోకలపై నే రాసిన కవితలు అందుకుందురుగానిలెండి.

నేను 12 October 2009 9:22 PM  

Thanks andi

SASI 18 October 2009 7:49 AM  

awesome photography ,mee orkut profile kudu chusanu .photos chala bagunayi.no words to explain the creativeness behind these pic .....i love these pic thats it

నేను 19 October 2009 5:03 PM  

thank you SASI :)

teja 11 November 2009 3:26 PM  

HI,NICE PHOTOS.

నేను 8 December 2009 11:13 PM  

thanks Tejagaru :)

నేను..

My Photo
కొంచం తపన, కాస్త ఆసక్తి, కొన్ని కలలు, కాసిన్ని ఊహలు కలిపేస్తే నేను

మరో బ్లాగులో చిత్రాలు

Loading...

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP