జ్ఙాపకాల వెల్లువలో
భలే నిండుగా అనిపించాయి పూలు, చుట్టూ ముసిరే తేనెటీగలు, మెరిసే లేత చిగురులు
busy buzzy bees just like my brother
నా కనులేవిటి ఇలా మసకబారిపోతున్నాయి…. ఆవి కరివేపాకు పువ్వులైనంతమాత్రాన….ఎక్కడినించి ఇంత ఉక్రోషం తన్నుకొచేస్తోంది……
వర్షం పడుతోందోచ్……
కాని నా గొంతేవిటి ఇలా పూడుకుపోయింది, ఎకడినుంచొచ్చేస్తోంది ఇంత దిగులు….. గబా గబా కరివేపాకు కోసేసుకొచ్చి వేడి వేడిగా పకోడీ వెయ్యాలనిపించింది.. కానీ ఇష్టంగా తినేదెవ్వరు, “అలా పడేస్తే ఓ చీమ వచి తింటుంది, అది నేనే” అని చెప్పే వారు తప్ప........
అభిమానం పెరిగే కొలదీ, ఆవేదన కూడా ఎందుకు ఎక్కువౌతుంది….. అంత ఆరాటం ఎందుకు అసలు…. ఒకప్పుడు ఎంతో సంబరం వేసే వి అలాగే ఉన్నాయి, నేనూ అలాగే ఉన్నాను, కానీ వాటిని చూస్తే కలిగే భావన లో ఎందుకు ఇంత మార్పు….
ఎదేమైనా వదలలేని తాపత్రయం ఎందుకు…..
ఎవరో ఫలానాకి ఆవాలు అంటే అమితమైన ఇష్టం వుంటే, నేనెందుకు మొక్కలు పెంచి పూలను చూసి, మురిసిపోవడం.....కాయాలు ఎండాకా జాగ్రత్తగా ఆవాలు వలిచి దాయడం....
సముదాయించే సమాధానాలు సంపాదించే కంటే ప్రశ్న గా మిగిలిపోవడమే సులువేమో.....
9 మీ ప్రతిస్పందన, సూచనలు:
అబ్బ.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకీ.. బావున్నారాండీ స్పందన గారూ.. nice to see you after soooo long time. :)
మీ ఫోటోలు చూడగానే మా ఇంట్లో కరివేపాకు చెట్టు గుర్తొచ్చింది. నన్ను కూడా జ్ఞాపకాల వెల్లువలో కొట్టుకుపోయేలా చేసారు.
అన్నీ ఫోటోలు బావున్నాయి గానీ మొదటి నుంచీ రెండోదీ, చివరి నుంచీ రెండోదీ ఎక్కువ నచ్చేసాయండీ. :)
Nice....last 2 pics well captured
busy eppudu temporary. everything will be alright soon. may be just a small break
:)
@మంచు - ఫో రా దుష్ట అన్నా...USBP అంటే నీ బుర్ర తెగ వాడేసి universal serial bus port అనుకొనేవు, USBP అంటే U-ఉత్తుత్తి S-సొల్లు చెప్పే B-busy P-పుచ్చకాయి అని
మీ ఫోటోల వల్లో.. లేక అవి చెప్పిన మాటలవల్లో.. నా మనసులోనూ వాన మొదలైందండీ!
నిజమే! కొన్ని ప్రశ్నల్లోనే సమాధానాలుంటాయి.. మళ్ళీ ప్రత్యేకంగా వాటికోసం వెదకక్కర్లేదు :-)
నాకైతే వాన పడుతున్న కరివేపాకు చెట్టు, ఇంకా చివరి ఫోటో -- ఇవి రెండూ చాలా నచ్చాయి :-)
ప్చ్, మా కరివేపాకు చెట్టుకు ఇంతందంగా ఎప్పుడూ పూలు పూయలేదండీ! :((
సింప్లీ సూపర్బ్ ఓ అమ్మాయి గారు
కంప్యూటర్ ఇన్ తెలుగు . కాం
Post a Comment