జ్ఙాపకాల వెల్లువలో
భలే నిండుగా అనిపించాయి పూలు, చుట్టూ ముసిరే తేనెటీగలు, మెరిసే లేత చిగురులు
busy buzzy bees just like my brother
నా కనులేవిటి ఇలా మసకబారిపోతున్నాయి…. ఆవి కరివేపాకు పువ్వులైనంతమాత్రాన….ఎక్కడినించి ఇంత ఉక్రోషం తన్నుకొచేస్తోంది……
వర్షం పడుతోందోచ్……
కాని నా గొంతేవిటి ఇలా పూడుకుపోయింది, ఎకడినుంచొచ్చేస్తోంది ఇంత దిగులు….. గబా గబా కరివేపాకు కోసేసుకొచ్చి వేడి వేడిగా పకోడీ వెయ్యాలనిపించింది.. కానీ ఇష్టంగా తినేదెవ్వరు, “అలా పడేస్తే ఓ చీమ వచి తింటుంది, అది నేనే” అని చెప్పే వారు తప్ప........
అభిమానం పెరిగే కొలదీ, ఆవేదన కూడా ఎందుకు ఎక్కువౌతుంది….. అంత ఆరాటం ఎందుకు అసలు…. ఒకప్పుడు ఎంతో సంబరం వేసే వి అలాగే ఉన్నాయి, నేనూ అలాగే ఉన్నాను, కానీ వాటిని చూస్తే కలిగే భావన లో ఎందుకు ఇంత మార్పు….
ఎదేమైనా వదలలేని తాపత్రయం ఎందుకు…..
ఎవరో ఫలానాకి ఆవాలు అంటే అమితమైన ఇష్టం వుంటే, నేనెందుకు మొక్కలు పెంచి పూలను చూసి, మురిసిపోవడం.....కాయాలు ఎండాకా జాగ్రత్తగా ఆవాలు వలిచి దాయడం....
సముదాయించే సమాధానాలు సంపాదించే కంటే ప్రశ్న గా మిగిలిపోవడమే సులువేమో.....