Monday, July 21, 2008

నందివర్ధనం పూలు


8 మీ ప్రతిస్పందన, సూచనలు:

భావన February 27, 2009 at 9:29 AM  

స్పందన.. పువ్వులు బాగున్నాయి చిన్నమాట కాని అంతకంటే ఇంకా ఏమని express చెయ్యాలో నాకు తెలియటం లేదు... చాలా అధ్బుతం గా వున్నాయి.. నంది వర్ధానాలు... నిత్య మల్లె పులు.. తెలుగింటి ముంగిట మెరిసే నిత్య నీలాంబారాలు.. ఇండియా ను వదిలేసినందుకు దుఖం కళ్ళలో సుడులు తిరుగుతుంటే అది చాలదన్నట్లు పాపికొండలు... ఒక పాట మీతో పంచుకోకుండా వుండలేక పోతున్నా "పాపికొండలా పండువెన్నెలే పక పక నవ్వాలా వెండి గిన్నె లో పాల బువ్వలా రెల్లే నవ్వాలా నీ మువ్వలు కవ్విస్తుంటే ఆ సవ్వడి సయ్యంటుంటే సెలేయరమ్మ గోదారమ్మ చేతులు కలపాలా చేతులు విడిచిన చెలిమి ని తలచి కుంగి పోవాలా " ఇన్ని అనుభూతులను ఒక్క సారి గా పంచిన మీకు మరి మరి కృతజ్ఞతలు....

నేను February 28, 2009 at 10:23 AM  

మా గోదావరి జిల్లాను వదలి హైదరాబాదు వచ్చి పడినందుకే ఎప్పుడెప్పుడు చదువు ముగించేసుకుని తిరిగి వెళ్ళిపోదామా అనిపిస్తోంది...కానీ కాలం ఎటు తీసుకెల్తుందో తెలీదు కదండి. నగరం ప్రత్యేకతలు నగరానివే అనుకోండి ఎంతైనా నిండా పూచిన కృష్ణ బంతి పూలు చామంతుల విత్తనాలు అన్నీ దాచి వాటిని ఒకచోట జల్లి నార చూసి తెగ ముచ్చట పడిపోయి, పాలవాడిని బ్రతిమాలి కాస్త పెంట తెప్పించుకుని,మళ్ళీ వాటిని విడిగా పాతి, చిగురుల లోంచి మొగ్గలు కనిపిస్తూఉంటే ఎప్పుడెప్పుడు పూలౌతాయా అని ఎదురుచూడడంలో ఉన్న ఆనందం...అలా వెళ్ళి నిండా మొగ్గలున్న ఓ కుండీ తెచ్చేసుకుని పూలు చూస్తే కూడా ఆనందమే, కానీ ఎక్కడో చిన్న వెలితి. అప్పటికప్పుడు ఆకులు కోసి తెస్తే వండిన పాలకూర, గోడ ఎక్కి కోసిన బొప్పాయి, గోడ దూకి కోసిన బంగినపల్లి మామిడి, పొరపాటున గేటు వేయడం మర్చిపోతే, దొరికిందే సందని దర్జాగా వచ్చి మందార ఆకులన్నీ నమిలేసిన మేకపై కోపం, అనుభవాలన్నీ జ్ఞాపకాలయ్యాయి....

మెహెర్ August 5, 2009 at 6:44 PM  

ఇవి నందివర్థనాలా? నేనిన్నాళ్ళూ నిత్యమల్లెలనుకున్నానే :(

నేను August 6, 2009 at 8:18 AM  

ఇవే నందివర్ధనాలండి, నిత్యమల్లి ఇదిగో

http://naachitraalu.blogspot.com/2009/01/blog-post.html

Geetha August 14, 2009 at 3:31 AM  

Spandana..

naaku india gurthuchesaavu...thanks allot..nenu nee jaipoola photo ni desktop meeda wall paper la pettukunna....nee photography ki, kalaa drusti ki hats off..

-Geetha

నేను August 15, 2009 at 9:36 AM  

Thanks Geethagaaru :)

Hima bindu December 13, 2009 at 10:53 PM  

మీ బ్లాగ్ చాలా బాగుంది

నేను December 14, 2009 at 10:08 AM  

ధన్యవాదాలు చిన్నిగారు :)

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP