Wednesday, June 16, 2021
Friday, April 20, 2012
జ్ఙాపకాల వెల్లువలో
భలే నిండుగా అనిపించాయి పూలు, చుట్టూ ముసిరే తేనెటీగలు, మెరిసే లేత చిగురులు
busy buzzy bees just like my brother
నా కనులేవిటి ఇలా మసకబారిపోతున్నాయి…. ఆవి కరివేపాకు పువ్వులైనంతమాత్రాన….ఎక్కడినించి ఇంత ఉక్రోషం తన్నుకొచేస్తోంది……
వర్షం పడుతోందోచ్……
కాని నా గొంతేవిటి ఇలా పూడుకుపోయింది, ఎకడినుంచొచ్చేస్తోంది ఇంత దిగులు….. గబా గబా కరివేపాకు కోసేసుకొచ్చి వేడి వేడిగా పకోడీ వెయ్యాలనిపించింది.. కానీ ఇష్టంగా తినేదెవ్వరు, “అలా పడేస్తే ఓ చీమ వచి తింటుంది, అది నేనే” అని చెప్పే వారు తప్ప........
అభిమానం పెరిగే కొలదీ, ఆవేదన కూడా ఎందుకు ఎక్కువౌతుంది….. అంత ఆరాటం ఎందుకు అసలు…. ఒకప్పుడు ఎంతో సంబరం వేసే వి అలాగే ఉన్నాయి, నేనూ అలాగే ఉన్నాను, కానీ వాటిని చూస్తే కలిగే భావన లో ఎందుకు ఇంత మార్పు….
ఎదేమైనా వదలలేని తాపత్రయం ఎందుకు…..
ఎవరో ఫలానాకి ఆవాలు అంటే అమితమైన ఇష్టం వుంటే, నేనెందుకు మొక్కలు పెంచి పూలను చూసి, మురిసిపోవడం.....కాయాలు ఎండాకా జాగ్రత్తగా ఆవాలు వలిచి దాయడం....
సముదాయించే సమాధానాలు సంపాదించే కంటే ప్రశ్న గా మిగిలిపోవడమే సులువేమో.....
చేర్చినది నేను at 11:36 AM 9 మీ ప్రతిస్పందన, సూచనలు
Friday, May 14, 2010
Friday, May 7, 2010
Saturday, May 1, 2010
Saturday, April 24, 2010
Sunday, March 28, 2010
Monday, January 25, 2010
Saturday, January 16, 2010
Thursday, December 31, 2009
Sunday, December 13, 2009
Monday, August 3, 2009
అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసం....
ఉపోద్ఘాతం:
అనగనగా ఒక రోజు సీతాకోకచిలుక అరచేత వాలింది...అనుకోకుండా ఒకరోజు అదే రంగులో ఉన్న గూడు కనిపించింది...బయటకు వచ్చిన వెంటనే సీతాకోక చిలుకలు రెక్కలు తడిగా ఉండడం వల్ల ఎగరలేవని, అప్పుడు సాలిపురుగులు వాటిని స్వాహా చేసేస్తాయనీ విన్నాను..దీనిని ఎలాగైనా కాపాడెయ్యాలని దట్టంగా ఆకులున్న పొదలాంటి మొక్కలో పెట్టా తీసుకెళ్ళి..ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని చూడడం....ఆ రోజెందుకో త్వరగానే నిద్రలేచాను.....ఉదయం 6:30 అయ్యింది...అలవాటు ప్రకారం వచ్చి చూస్తే బయటకు రావడానికి అష్టకష్టాలూ పడుతున్న సీతా కోక చిలుక కనిపించింది..ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తి కెమేరా తెచ్చేశా..
గూడు రంగుకీ సీతాకోకచిలుక రెక్కల రంగుకీ అస్సలు సంబంధం లేకపోవటం ఆశ్చర్యం వేసింది...
చేర్చినది నేను at 7:01 PM 29 మీ ప్రతిస్పందన, సూచనలు
Labels: గూటిలోంచి గాలిలోకి, సీతాకోకచిలుక
Monday, July 27, 2009
వారం తరువాత...
అరచేత వాలిన సీతకోకచిలుక రంగులో ఉన్న గూడు కనిపించింది..
ఇంక అందులోంచి రెక్కవిప్పుకుని ఎప్పుడు బయటకు వస్తుందా అని ఒకటే ఎదురుచూపులు...గంటకీ రెండుగంటలకోసారి మొక్కల దగ్గరకు వెళ్ళి దాన్ని చూడటం దినచర్యలో భాగం ఐపోయింది...
చేర్చినది నేను at 11:19 PM 5 మీ ప్రతిస్పందన, సూచనలు
Labels: సీతాకోకచిలుక
Tuesday, May 19, 2009
Subscribe to:
Posts (Atom)











